
జనరల్

త్రిప్తి దిమ్రి ‘యానిమల్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తర్వాత ఇప్పుడు తన కెరీర్‌లో మంచి ఫామ్‌లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సరసన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’లో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన త్రిప్తి, నటిగా ఉండటంలో ఉన్న లాభాలు, సవాళ్ల గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రతి పాత్ర తనకు కొత్త జీవితాన్ని అనుభవించే అవకాశం ఇస్తుందని చెప్పారు. అలాగే కెరీర్‌లో వచ్చే ఫెయిల్యూర్స్ మనకు సహనం, ఆత్మవిశ్వాసం నేర్పిస్తాయని తెలిపారు. కష్టకాలంలో కూడా వెనక్కి తగ్గకుండా కష్టపడి పనిచేయడమే విజయానికి మార్గమని ఆమె స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!