
ఓటీటీ

టాలీవుడ్ యువ నటి శ్రీలీల తన నటన, నృత్యంతో పాటు ఆలోచనలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న ఆమె, స్థానిక భాషల పట్ల తన గౌరవాన్ని వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలతో మరింత అనుబంధం ఏర్పడేందుకు స్థానిక భాషలో మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని శ్రీలీల తెలిపింది.
తాను పని చేసే ప్రతి భాషను గౌరవిస్తానని చెప్పిన శ్రీలీల, వేదికలపై స్థానిక భాషలో మాట్లాడటం ఆ ప్రాంత ప్రజలకు ఇచ్చే కనీస గౌరవమని పేర్కొంది. ఇది కేవలం ప్రచారం కోసం చేసే పని కాదని, తమను ఆదరించే ప్రేక్షకుల సంస్కృతి, భాషను గౌరవించడమేనని స్పష్టం చేసింది. శ్రీలీల వ్యాఖ్యలకు నెటిజన్లు, సినీ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!