

తమిళ చిత్రసీమలో మరో భారీ మల్టీస్టారర్ సినిమాపై ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. కమల్ హాసన్, రజనీకాంత్ కలయికలో తెరకెక్కాల్సిన చిత్రం ఆగిపోయిందంటూ వస్తున్న ప్రచారానికి ఓ ప్రముఖ తమిళ పంపిణీదారుడు తెరదించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కచ్చితంగా పట్టాలెక్కుతుందని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ నటిస్తున్న ‘ధర్మన్’, కమల్ హాసన్ నటిస్తున్న ‘సండియార్’ చిత్రాల షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ భారీ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కానున్నట్లు సమాచారం. దీంతో ఇద్దరు దిగ్గజ నటులను ఒకే తెరపై చూడాలన్న అభిమానుల కల నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రెడ్ జెయింట్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 2028 పొంగల్ సందర్భంగా సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తతో కోలీవుడ్ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ చిత్రం తమిళ చిత్ర పరిశ్రమలో తొలి వెయ్యి కోట్ల వసూళ్ల సినిమాగా నిలుస్తుందనే అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇంతటి భారీ ప్రాజెక్ట్‌కు కథ, ప్రీ ప్రొడక్షన్ పనులు కీలకం కానున్నాయి. అందుకే స్క్రిప్ట్‌ను పక్కాగా సిద్ధం చేసేందుకు దర్శకుడు నెల్సన్‌కు తగినంత సమయం ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. కమల్, రజనీకాంత్ కలయికలో రానున్న ఈ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!