

బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి తన కుమారుడు అహాన్ శెట్టి నటించిన బోర్డర్ 2 సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తర్వాతే తాను చూస్తానని, అలాంటి నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. జనవరి 23 న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇటీవల ABP Network నిర్వహించిన Ideas of India Summit 2026 కార్యక్రమంలో పాల్గొన్న సునీల్ శెట్టి ఈ విషయాన్ని వెల్లడించారు.
దేశభక్తి నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా రూ.500 కోట్లు సాధించాలని ముందే అనుకున్నాను. ఆ మార్క్ దాటిన తర్వాతే చూస్తానని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం సినిమా రూ.489 కోట్ల వద్ద ఉంది. ఇంకొన్ని కోట్లు చేరితే ఒక తండ్రిగా నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది అని భావోద్వేగంగా తెలిపారు.
ఈ చిత్రంలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్ మరియు అహాన్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. 1997 లో విడుదలైన బోర్డర్ సినిమాకు ఇది సీక్వెల్‌గా రూపొందింది. తొలి భాగంలో సునీల్ శెట్టి కీలక పాత్ర పోషించారు.
తన నిర్ణయం కారణంగా సినిమా ప్రీమియర్‌కు హాజరైనప్పటికీ, థియేటర్లోకి వెళ్లలేదని ఆయన తెలిపారు. లక్ష్యానికి చేరువలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే రూ.500 కోట్ల మైలురాయిని దాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!