

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ప్రస్తుతం లండన్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారారు. వ్యాపారవేత్త ఆనంద్ అహుజాతో వివాహం అనంతరం ఆమె ఎక్కువ సమయం లండన్‌లో గడుపుతున్నారు. ఇప్పటికే నాటింగ్ హిల్ ప్రాంతంలో విలాసవంతమైన భవంతిని కొనుగోలు చేసిన ఈ జంట, దానిని ఆధునిక సదుపాయాలతో పునర్నిర్మించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇండోర్ స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ జిమ్, బాస్కెట్‌బాల్ కోర్టు వంటి సదుపాయాలతో ఆ ఇంటిని పూర్తిగా నవీకరించినట్లు సమాచారం.
తాజాగా తమ నివాసానికి సమీపంలో ఐదు ఫ్లాట్లు కూడా ఈ జంట కొనుగోలు చేసిందనే వార్తలు చర్చకు దారి తీసాయి. ఈ ఫ్లాట్లను వ్యక్తిగత సిబ్బంది కోసం ఉపయోగించే అవకాశం ఉందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, భవన నిర్వహణలో ప్రభావం పెంచుకునే ప్రయత్నమా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని సోనమ్ ప్రతినిధులు ఖండిస్తూ, ఆ ఫ్లాట్లు కేవలం పెట్టుబడి కోసమే కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో విదేశాల్లో భారతీయుల పెట్టుబడులు పెరుగుతున్నాయనే అంశం మరోసారి ప్రాధాన్యం పొందింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!