

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న ఊహాగానాలకు ఆయన సన్నిహిత వర్గాలు స్పష్టత ఇచ్చాయి. ఈ నెల 16న ఆయన ముంబయిలోని ఆసుపత్రికి వెళ్లిన విషయం నిజమేనని, అయితే అది కేవలం సాధారణ ఆరోగ్య పరీక్షల కోసమేనని వెల్లడించాయి. అన్ని పరీక్షలు పూర్తైన అనంతరం ఆయనను డిశ్చార్జ్ చేసినట్లు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైద్య వర్గాలు పేర్కొన్నాయి.
తన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న అభిమానులను ఉద్దేశించి అమితాబ్ తన బ్లాగ్‌లో స్పందించారు. తాను క్షేమంగా ఉన్నట్లు తెలియజేస్తూ “ప్రేమ, ప్రార్థనలు ఇంకా మరెన్నో” అని రాశారు. 83 ఏళ్ల వయసులోనూ ఆయన వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD సీక్వెల్‌తో పాటు ‘సెక్షన్ 84’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే త్వరలోనే ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!