
స్టార్ హీరోయిన్ సమంతకు ఇండస్ట్రీలో ఉన్న అత్యంత సన్నిహిత స్నేహితుల్లో ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సామ్ జీవితంలో వచ్చిన కష్టాల్లో, సంతోషాల్లో శిల్పా ఎల్లప్పుడూ అండగా నిలిచింది. ముఖ్యంగా నాగచైతన్య విడాకుల తర్వాత సమంత మానసికంగా నిలబడటానికి శిల్పా ఇచ్చిన బలం అమూల్యమని అభిమానులు తరచూ చెబుతుంటారు.
ఇటీవల రాజ్ నిడిమోరు వివాహ వేడుకలో శిల్పా రెడ్డి హైలైట్గా నిలిచింది. ఆ ఫోటోలను సమంత షేర్ చేస్తూ, శిల్పా తన జీవితంలో తీసుకువచ్చిన మార్పుల గురించి ఎంతో భావోద్వేగంగా వివరించింది.
సమంత ఇలా పేర్కొంది:
“శిల్పా రెడ్డి… నువ్వు నా జీవితాన్ని ఎన్ని రకాలుగా మార్చావో నీకు కూడా తెలియదు. నన్ను ధ్యానంలోకి నెట్టిన ఆ 15 నిమిషాలు నా జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేశాయి. అలాంటి గొప్ప బహుమతిని ఇచ్చినందుకు ధన్యవాదాలు.”
ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఏమిటో చూపించే అందమైన ఉదాహరణగా నెటిజన్లు వీరిద్దరి బంధాన్ని కొనియాడుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!