

రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న సెన్సేషనల్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ నుంచి వస్తున్న అప్డేట్స్తో సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో మెలిస్సా పాత్రలో రుక్మిణి వసంత్‌ను పరిచయం చేస్తూ మేకర్స్ విడుదల చేసిన లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేపింది. పోస్టర్లో ఆమె ఆత్మవిశ్వాసం, అధికారంతో కూడిన స్టైల్, నిర్భయమైన లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. యష్–గీతూ మోహన్ దాస్ కాంబినేషన్‌కు రుక్మిణి వసంత్ చేరడం సినిమాకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. డైరెక్టర్ గీతూ కథలోని డెప్త్, సీరియస్‌నెస్‌ను అర్థం చేసుకుని సహజమైన నటనతో భావోద్వేగాలను ఆవిష్కరించగల నటి రుక్మిణి అని యూనిట్ అభిప్రాయపడుతోంది.
ఈ చిత్రంలో నాడియా పాత్రలో కియారా అద్వానీ, ఎలిజబెత్ పాత్రలో హుమా ఖురేషి, గంగగా నయనతార, రెబెకాగా తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వారి లుక్స్‌కు మంచి స్పందన లభించగా, తాజాగా రుక్మిణి వసంత్ లుక్‌తో కథా ప్రపంచం మరింత లోతుగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. 1960 ల చివర్లో సాగే కథా నేపథ్యంతో, తక్కువ వెలుతురు ఉన్న ప్రదేశంలో జరిగే పార్టీ సన్నివేశంలో మెలిస్సా పాత్రను పరిచయం చేస్తూ ఆమె ఆత్మవిశ్వాసం, లక్ష్యంపై స్పష్టత, నడకలోని ఆధిపత్యం వంటి అంశాలను హైలైట్ చేశారు. ప్రతి పాత్రను ప్రత్యేకంగా పరిచయం చేయడం ద్వారా సినిమా భావోద్వేగాల పరిధి, సినిమాటిక్ స్థాయి మరింత విస్తరిస్తోంది.
యష్, గీతూ మోహన్ దాస్ కలిసి కథను రూపొందించగా, గీతూ దర్శకత్వంలో ఈ సినిమాను ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా పలు భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేయనున్న ఈ చిత్రంపై అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలున్నాయి. నేషనల్ అవార్డు గ్రహీత రాజీవ్ రవి సినిమాటోగ్రఫీని, రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తుండగా, జేజే పెర్రీ (జాన్ విక్ ఫేమ్)తో పాటు అన్బరివ్ యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ, యష్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 19 న లాంగ్ వీకెండ్ సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!