

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 లో ఈ వారం ఎలిమినేషన్‌గా రీతూ చౌదరి బయటకు వెళ్లింది. డిమోన్ పవన్, సంజన, రీతూ చౌదరి, సుమన్ శెట్టి, తనూజ, భరణిలు నామినేషన్లో ఉన్నప్పటికీ, ప్రేక్షకుల ఓట్లు అతి తక్కువగా రావడంతో రీతూ హౌస్ ను వీడాల్సి వచ్చింది అని వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించారు.
సీజన్ ముగింపుకు దగ్గరపడుతున్న నేపథ్యంలో, రీతూ ఎలిమినేషన్ తర్వాత ఇంట్లో కేవలం ఏడుగురు మాత్రమే మిగిలారు. వీరిలో టాప్-5 కంటెస్టెంట్స్ మాత్రమే ఫైనల్ వారం వరకు వెళ్లనున్నారు.
బయటకు వచ్చిన తరువాత, తన మొత్తం ప్రయాణం కనిపించడంతో రీతూ భావోద్వేగానికి గురయ్యారు. హౌస్‌లో మిగిలిన ఏడుగురికి ర్యాంకులు కేటాయించమని నాగార్జున అడగగా, రీతూ తన అభిప్రాయం వెల్లడించారు.
ఒకసారి బయటకు వెళ్లి తిరిగి వచ్చిన భరణిని ఏడో స్థానంలో ఉంచారు. మాట్లాడే స్టైల్లో మార్పు అవసరం ఉందని భావించి సుమన్‌శెట్టి ఆరో స్థానంలో ఉంచారు. నిజాయితీగా మాట్లాడే నైజం ఉన్నందుకు సంజనకు ఐదో స్థానాన్ని ఇచ్చారు.
కల్యాణ్‌ను నాలుగో ర్యాంక్‌లో ఉంచిన రీతూ, ఇమ్మాన్యుయేల్ మరియు తనూజలకు మూడో, రెండో స్థానాలను వరుసగా ఇచ్చారు.
డిమోన్ పవన్‌ను నెంబరు వన్ స్థానంలో ఉంచుతూ, ఈ సీజన్ విజేత అవ్వాలని కోరుకున్నారు. అలాగే పవన్ విజయ కప్పును తీసుకుని తన ఇంటికి రావాలని సరదాగా ఆహ్వానించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!