

‘సైయారా’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ యువ కథానాయిక అనీత్ పడ్డా త్వరలో మహిళా ప్రాధాన్య హారర్ చిత్రం ‘శక్తి శాలిని’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘సైయారా’ తర్వాత రొమాంటిక్ చిత్రాలకు దూరంగా ఉండి, విభిన్నమైన కథతో సినిమా చేయాలని భావించినట్లు తెలిపారు. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని, తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనుందని చెప్పారు.
తాను కథానాయికగా పూర్తి బాధ్యత తీసుకునే చిత్రంలో నటించాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నానని అనీత్ వెల్లడించారు. రెండో సినిమాతోనే అలాంటి అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. అయితే సినిమా మొత్తం బాధ్యత తనపైనే ఉండటం కొంత భయంగా అనిపిస్తోందని చెప్పారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా, దానికి తానే బాధ్యత వహిస్తానని స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!