

ప్రస్తుతం ‘జైలర్-2’ లో నటిస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్, దాని తర్వాత తన పాత మిత్రుడు కమల్ హాసన్ నిర్మాణం లో ఒక సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ లెజెండరీ కాంబినేషన్ పై అభిమానులు అపారంగా ఉత్సాహించారు. మొదట ఈ చిత్రానికి సీనియర్ దర్శకుడు సుందర్.సి ని ఎంపిక చేశారు, కానీ 10 రోజుల్లోనే అతను ప్రాజెక్ట్ ను వదిలేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచేశాడు. దీంతో కొత్త దర్శకుడిని వెతకడం మొదలైంది. ముందు లోకేష్ కనకరాజ్ పేరు పరిగణలోకి వచ్చింది, కానీ ‘కూలీ’ విఫలమవడంతో అతన్ని పక్కన పెట్టారు.
ఇప్పుడు యువ దర్శకుడు రామ్ కుమార్ పేరు వినిపిస్తోంది. అతను ‘పార్కింగ్’ అనే చిన్న సినిమా తీసి, దానికి రెండు జాతీయ పురస్కారాలు సాధించాడు. కానీ, అలాంటి చిన్న, క్లాసిక్ శైలి సినిమాను తీసిన దర్శకుడు రజనీకాంత్ చిత్రాన్ని హ్యాండిల్ చేయగలడా అనే అనుమానాలు పుట్టాయి. వాస్తవానికి, రామ్ కుమార్‌కు ముందు రజనీకాంత్, కమల్ హాసన్ లు ధనుష్ పేరును కూడా పరిశీలించారు. ధనుష్ రజనీకాంత్ అల్లుడు కావడంతో, అతను రజనీకాంత్‌ను దర్శకుడిగా చేయాలని ఒక కథ సిద్ధం చేసుకున్నాడు, కానీ అప్పట్లో అది సాధ్యం కాలేదు. తర్వాత రజనీకాంత్ కూతురు ఐశ్వర్య-ధనుష్ విడాకులు, ధనుష్ నటుడిగా-దర్శకుడిగా పూర్తిగా బిజీ అవడం జరిగింది.
కమల్ నిర్మాణంలో రజనీకాంత్ చిత్రానికి దర్శకులను చూస్తుండగా, ధనుష్ పేరు మళ్లీ ప్రస్తావనకు వచ్చింది. అయితే, తన వద్ద కథ ఉన్నప్పటికీ, కమిట్మెంట్ల కారణంగా వెంటనే ప్రాజెక్ట్‌ను చేపట్టలేని పరిస్థితిలో ధనుష్ ఉన్నాడు. దీంతో సుందర్.సి వైపు చూశారు, కానీ అతను ఊహించని విధంగా వెనక్కి తగ్గాడు. కొన్ని రోజుల తర్వాత ధనుష్ రజనీకాంత్‌తో సినిమా చేయాలని ఆసక్తి చూపించాడు. కానీ, ఆ సమయానికి రజనీకాంత్, కమల్ హాసన్‌లు రామ్ కుమార్‌తో చర్చలు ప్రారంభించి, ఆ కాంబినేషన్ దాదాపు ఫిక్స్ అయిపోవడంతో, ధనుష్ తో చేయడానికి రజనీకాంత్ సానుకూలంగా స్పందించలేదని కోలీవుడ్ మీడియాలో వార్తలు చెబుతున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!