

క్రిస్మస్ సినిమాల హడావుడి తగ్గిన తర్వాత బాక్సాఫీస్ వద్ద పరిస్థితులు మారుతున్నాయి. ‘శంబాల’ తన అంచనాలకు తగ్గట్టు రన్ పూర్తి చేసుకోగా, ‘ఈషా’ మిక్స్డ్ టాక్ మధ్యలోనే నిలబడింది. మరోవైపు ‘చాంపియన్’ మాత్రం వీక్‌డేస్‌లో కలెక్షన్లు తగ్గడంతో ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో థియేటర్ల దృష్టి ఇప్పుడు న్యూ ఇయర్ రిలీజ్లపైకి వెళ్లింది.
జనవరి 1న విడుదలవుతున్న సినిమాల్లో నందు హీరోగా నటించిన ‘సైక్ సిద్ధార్థ’ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను సురేష్ బాబు నిర్మించకపోయినా, కథ నచ్చడంతో సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేయడం విశేషం. వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, బ్రేకప్ తర్వాత జీవితాన్ని ఎదుర్కొంటున్న ఓ యువకుడి కథను చూపిస్తుంది. అదే సమయంలో పక్కింటి అమ్మాయితో సాగే మరో ప్రేమకథను కూడా సున్నితంగా మేళవించారు. కంటెంట్ కొత్తగా ఉండటం సినిమాకు ప్లస్‌గా మారింది.
చాలాకాలం తర్వాత నందు ఈ సినిమాలో పూర్తి ఎనర్జీతో కనిపిస్తున్నాడు. లుక్, బాడీ లాంగ్వేజ్, పెర్ఫార్మెన్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం న్యూ ఇయర్‌కు విడుదలవుతున్న ఇతర సినిమాలతో పోలిస్తే, ‘సైక్ సిద్ధార్థ’కు సరైన టైమింగ్ కలిసి వచ్చింది. జనవరి 9న భారీ చిత్రం ‘ది రాజా సాబ్’ విడుదలయ్యే వరకు ఈ సినిమాకు మంచి గ్యాప్ దొరికింది. పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ వస్తే, కనీసం వారం రోజుల పాటు నిలకడగా కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!