
సినిమాలు

న్యూ ఇయర్ సందర్భంగా పెద్ది సినిమా నుంచి ఏదైనా సర్ప్రైజ్ పోస్టర్ లేదా గ్లింప్స్ వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ ఈసారి మేకర్స్ పూర్తిగా మౌనంగా ఉన్నారు. ఈ మౌనం వెనుక సినిమా వాయిదా పడడమే కారణమని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
పెద్ది షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడం, కొన్ని సాంకేతిక కారణాలు ఉండటంతో మార్చి 27 న సినిమాను విడుదల చేయడం సాధ్యం కాదని సమాచారం. దీంతో ఈ చిత్రాన్ని డిసెంబర్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. ఈ వార్తలతో మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో, పెద్ది ఆలస్యమైతే ది ప్యారడైజ్, టాక్సిక్ సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!