

వీఆర్‌జీఆర్ మూవీస్ బ్యానర్‌పై వై. గంగాధర్ ఐపీఎస్ సమర్పణలో, రజని గొంగటి నిర్మాతగా నూతన దర్శకుడు జీ.వి. నాయుడు దర్శకత్వం వహించిన చిత్రం “క్యాట్” ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఫస్ట్ కాపీ రెడీ చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ, దర్శకుడు కమ్ యాక్టర్ జీ.వి. నాయుడు తనకు ఎన్నాళ్లుగానో తెలుసునని, ఆయన చెప్పిన క్యాట్ కథ వినూత్నంగా, ఆసక్తికరంగా అనిపించిందని తెలిపారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించి, చిత్రబృందానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.
డ్రామా, థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన క్యాట్ చిత్రంలో జీ.వి. నాయుడు, వి.జే. బాలు, లావణ్య, కళ్యాణి రాణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ పంకజ్ తొట్టాడ, ఎడిటింగ్ డి. వెంకటప్రభు, మ్యూజిక్ మారుతి రాజా అందించారు. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు వి.సిహెచ్. శేఖర్ ముద్దు రచించగా, దర్శకత్వం జీ.వి. నాయుడు (గొంగటి వీరాంజనేయులు) వహించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!