

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్‌పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలీల నాయికగా నటిస్తుండగా, రాశీ ఖన్నా కీలక పాత్రలో కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటలు, ప్రచార దృశ్యాలు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి స్పందన అందుకున్నాయి. తాజాగా విడుదల చేసిన లుక్‌లో పవన్ కళ్యాణ్ కుర్చీలో కూర్చొని తనదైన ధైర్యమైన శైలిలో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఇప్పటికే విడుదలైన చిన్న దృశ్యంలో మహంకాళి పోలీస్ స్టేషన్ నేపథ్యంలోని సంభాషణలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. గతంలో గబ్బర్ సింగ్ వంటి విజయవంతమైన కాంబినేషన్ మళ్లీ కలవడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 26 న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించడంతో సినీ వర్గాల్లో ఉత్సాహం నెలకొంది.









.jpg&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!