

కన్నడ సినిమా టాప్ స్టార్లలో కిచ్చా సుదీప్ ఒకరు. అతనికి ఇతర భాషల్లో కూడా బలమైన ఫాలోయింగ్ ఉంది. ‘ఈగ’ సహా కొన్ని చిత్రాల్లో నటించి తెలుగులో మంచి గుర్తింపు సంపాదించారు. హిందీలోనూ కొన్ని సినిమాల్లో కనిపించారు. కన్నడలో సుదీప్‌కు భారీ మార్కెట్ ఉంది.
కన్నడలో అయినా, ఇతర భాషల్లో అయినా ప్రత్యేక పాత్రలు చేయడానికి సుదీప్ ఎల్లప్పుడూ ఉత్సాహంగా ముందుకు వస్తారు. హీరోగా మాత్రమే కాకుండా విలన్, క్యారెక్టర్ రోల్స్ కూడా స్వీకరిస్తారు. అలాంటి నటుడు తన సినిమాల్లో క్యామియో చేయడానికి ఇతర భాషల స్టార్లు ముందుకు రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
సుదీప్ మాత్రమే కాకుండా శివరాజ్‌కుమార్, ఉపేంద్ర వంటి కన్నడ స్టార్లు కూడా ఇతర భాషల సినిమాల్లో క్యామియోలు చేస్తుంటారు. కానీ తాము ఇతర భాషలకు వెళ్లి ప్రత్యేక పాత్రలు చేసినట్లుగా, కన్నడ చిత్రాల కోసం ఇతర భాషల నటులు ముందుకు రావడం లేదని సుదీప్ ఆవేదన చెందారు. తాను చాలా సినిమాల్లో డబ్బులు కూడా తీసుకోకుండా క్యామియోలు చేశానని, వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేసినా సరే తమ చిత్రాల్లో నటించడానికి ముందుకు రాలేదని, ఇక్కడ పరస్పర సహకారం లోపిస్తోందని సుదీప్ అన్నారు.
క్రిస్మస్ కానుకగా సుదీప్ నుంచి ‘మార్క్’ అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో క్యామియోల కోసం ఇతర భాషల హీరోలను సుదీప్ అడిగినా వారు ముందుకు రాలేదని తెలుస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!