
గాసిప్స్

కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే ప్రభాస్ తన అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. వరుస అప్డేట్స్తో ఫ్యాన్స్ ఖుషీగా పండగ చేసుకుంటున్నారు. తాజాగా విడుదలైన స్పిరిట్ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సంబరాలు కొనసాగుతుండగానే ది రాజా సాబ్ నుంచి మరో సర్ప్రైజ్ బయటికి వచ్చింది.
ఈ సినిమాలోని ‘రాజే యువరాజే..’ అనే ఆడియో సాంగ్‌ను గురువారం విడుదల చేశారు. ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!