

అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతోన్న హుషారు పిట్టలు చిత్రం నుంచి మంగళస్నానం అనే హృదయస్పర్శి గీతాన్ని విడుదల చేశారు. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన చిత్ర టీజర్‌కు మంచి స్పందన లభించగా, ఇప్పుడు విడుదలైన ఈ పాట తండ్రి కూతుళ్ల మధ్య ఉన్న అప్యాయతను ఆవిష్కరిస్తోంది. ఎస్ఎస్ చిరంజన్ సాహిత్యం అందించగా యోగి సురేష్, విహా ఆలపించారు. చరణ్ అర్జున్ సంగీతాన్ని సమకూర్చారు.
దర్శకుడు మాట్లాడుతూ ఇది తండ్రి కూతుళ్ల అనుబంధాన్ని ప్రతిబింబించే భావోద్వేగ గీతమని తెలిపారు. యువతతో పాటు తల్లిదండ్రులు కూడా తప్పక చూడాల్సిన కుటుంబ కథా చిత్రమని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ మొదటి భాగం యువతకు దగ్గరగా సాగుతుందని, రెండో భాగంలో పరిపక్వతతో కూడిన కథనం ఉంటుందని వెల్లడించారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుందని, వినోదంతో పాటు సందేశాన్ని అందిస్తుందని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేసింది.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!