

భారతదేశవ్యాప్తంగా మంచి ప్రజాదరణ పొందిన ఓటీటీ, శాటిలైట్ సంస్థల్లో జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ ఒకటి. చాలా కాలం క్రితమే శాటిలైట్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను విస్తరించుకుంది. ఓటీటీ విప్లవం తర్వాత డిజిటల్ రంగంలోకి ప్రవేశించి జీ5 వేదికను విజయవంతంగా నిర్వహిస్తోంది. అంతేకాకుండా చిత్రాల డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా చురుకుగా వ్యవహరిస్తూ, వినోద రంగంలో బలమైన స్థానాన్ని ఏర్పరచుకుంది.
ఈ క్రమంలో శాటిలైట్, ఓటీటీ, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు జీ సంస్థ తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ భాగస్వామ్యాల ద్వారా అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, వృద్ధి సినిమాస్ వంటి ప్రముఖ బ్యానర్ల చిత్రాల డిస్ట్రిబ్యూషన్, శాటిలైట్, ఓటీటీ హక్కులను సొంతం చేసుకునే దిశగా సంస్థ ముందుకు సాగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!