

విజయ్ ఆంటోని మరియు దర్శకుడు శశి కలిసి చేసిన ‘బిచ్చగాడు’ సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ మళ్లీ ‘వంద దేవుళ్లు’ అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ మరియు సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లపై రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫాతిమా విజయ్ ఆంటోని ఈ సినిమాను సమర్పిస్తున్నారు.
ఈ చిత్రంలో విజయ్ ఆంటోని, స్వాసిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా డైనమిక్ స్టార్ విష్ణు మంచు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. పోస్టర్‌లో చెరుకు తోటలో కత్తి పట్టుకుని ఉన్న విజయ్ ఆంటోని లుక్ చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తుంది. అతని వెనుక స్వాసిక మాసీ లుక్‌లో కనిపించడం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ సినిమాలో విజయ్ ఆంటోని రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. పోస్టర్‌ను విడుదల చేసిన విష్ణు మంచు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి ఎస్.బి. దర్శన్ కిర్లోష్ సినిమాటోగ్రఫీ అందించగా, బాలాజీ శ్రీరామ్ సంగీతం అందిస్తున్నారు. హరిష్ యువరాజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భాష్య శ్రీ డైలాగులు రాస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్‌లు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.








.webp&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!