
సినిమాలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న “పెద్ది” సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్నప్పటికీ, ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై భారీ హైప్ మొదలైంది. “రంగస్థలం” తర్వాత చరణ్–సుకుమార్ కాంబో మళ్లీ కలిసి పనిచేయబోతుండటంతో ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం.
ఈసారి రామ్ చరణ్‌ను పూర్తిగా కొత్త లుక్‌లో చూపించాలనే ఆలోచనతో సుకుమార్ ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ముంబైకి చెందిన హెయిర్ స్టైలిస్ట్‌తో టెస్ట్ షూట్ కూడా నిర్వహించారట. “పుష్ప 2” తర్వాత వస్తున్న సుకుమార్ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి. జూలై నుంచి షూటింగ్ ప్రారంభం కానుండగా, అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!