
జనరల్

ప్రతిష్టాత్మక కేన్స్ చిత్రోత్సవం వేదికపై మహారాష్ట్ర నటి ప్రజక్తా మాలి తన సాంప్రదాయిక అలంకరణతో అందరి దృష్టిని ఆకర్షించింది. పాశ్చాత్య దుస్తులు ప్రధానంగా కనిపించే ఈ అంతర్జాతీయ వేదికపై ఆమె ఎరుపు రంగు పారదర్శక చీర, నుదుటన పెద్ద బొట్టు, సాంప్రదాయిక కొప్పు, మహారాష్ట్ర ప్రత్యేక ఆభరణాలతో ఎంతో హుందాగా కనిపించింది. ఆమె రూపం అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తన సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా కేన్స్‌కు వెళ్లిన ప్రజక్తా మాలి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రస్తుతం ఆమె చీర కట్టులో కనిపించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అంతర్జాతీయ వేదికపై భారతీయ అందాన్ని అద్భుతంగా ప్రదర్శించిందంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!