

ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్ఫుల్ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే బలవంత్' ( హే భగవాన్ చిత్రం టైటిల్ మార్పు) అనే ఫుల్‌లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో సుహాస్, శివానీ నాగారం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఈ నెల 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో సుహాస్ మంగళవారం పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి.
‘హే భగవాన్’ అనే టైటిల్‌ను ‘హే బలవంత్’గా మార్చడానికి కారణం సెన్సార్ సూచనలేనని తెలిపారు. ‘భగవాన్’ అనే పదం భగవంతుడిని సూచించేలా ఉండటంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని, అందుకే టైటిల్‌తో పాటు సినిమాలో నరేష్ పాత్ర పేరు కూడా మార్చామని చెప్పారు. కథ వినగానే నచ్చడంతో ఈ సినిమాకు ఓకే చెప్పానని, ఎంటర్టైన్మెంట్తో పాటు భావోద్వేగ అంశాలు కూడా బలంగా ఉన్నాయని వెల్లడించారు. చిన్నప్పటి నుంచి వ్యాపారం చేయాలని ఆశపడే ఓ యువకుడు, తన తండ్రి వ్యాపారాన్ని చేపట్టే క్రమంలో ఎదుర్కొనే సంఘటనల చుట్టూ సినిమా తిరుగుతుందని, పూర్తి వినోదాత్మకంగా రూపొందిందని తెలిపారు. తక్కువ వర్కింగ్ డేస్‌లో పూర్తి చేసినప్పటికీ క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడలేదని, ఈ సినిమా తనకు మంచి విజయాన్ని అందిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు.
తన కెరీర్లో విజయాల కోసం ఎదురుచూస్తున్నానని, ఫెయిల్యూర్స్ వచ్చినా వెంటనే తదుపరి సినిమాకు సిద్ధమవుతానని చెప్పారు. వరుస అపజయాల తర్వాత జాగ్రత్తగా కథలు ఎంపిక చేసుకుంటూ ‘హే బలవంత్’ను చేశానని, కుటుంబ సభ్యులు కూడా మంచి సినిమాలు చేయాలని ప్రోత్సహించారని తెలిపారు. ఈ చిత్రంపై టీమ్ అంతా విశ్వాసంతో ఉన్నారని, ఇది పెద్ద విజయాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక తమిళ చిత్రం ‘మందాడి’లో ప్రధాన విలన్ పాత్ర పోషిస్తున్నానని, భిన్నమైన లుక్‌లో కనిపించబోతున్నానని చెప్పారు. గతంలో ఎక్కువగా సీరియస్ పాత్రలు చేసినప్పటికీ, ఈ సినిమాలో కామెడీ షేడ్ కూడా కనిపిస్తుందని, తన కెరీర్‌పై పూర్తి సంతృప్తితో ఉన్నానని వెల్లడించారు.
అలాగే కార్తీక్ సుబ్బరాజు బ్యానర్లో ఒక సినిమా చేస్తున్నానని, ఆయన కథ అందిస్తుండగా ఆయన అసోసియేట్ దర్శకత్వం వహిస్తున్నారని తెలిపారు. తెలుగులో కూడా కొన్ని కథలు వింటున్నానని, త్వరలోనే కొత్త ప్రాజెక్టులు ఖరారయ్యే అవకాశముందని పేర్కొన్నారు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!