

‘జయహో జనార్ధన’ సినిమాలోని హై ఎనర్జీ సాంగ్ ‘చిందువేయవే చాందుక తుకడ’ను ‘పెద్ది’ సినిమా దర్శకుడు బుచ్చిబాబు సానా చేతుల మీదుగా విడుదల చేశారు. పానుగంటి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పానుగంటి శరత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించగా, ‘ది ప్యారడైజ్’లోని ‘ఆయా షేర్’ పాటతో గుర్తింపు తెచ్చుకున్న జంగి రెడ్డి ఈ పాటను హుషారైన స్వరంతో ఆలపించారు. చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. నరేష్ వాసం, రమ్యశ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఇటీవల విజనరీ డైరెక్టర్ సంపత్ నంది చేతుల మీదుగా ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రేమ, కమర్షియల్ అంశాలు, కామెడీ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 30 ఇయర్స్ పృథ్వీ, రోలర్ రఘు, చలాకి చంటి, మైమ్ మధు, దయానంద రెడ్డి, జబర్దస్త్ రాఘవ, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ రాజమౌళి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నందమూరి హరి ఎడిటర్‌గా, విజయ్ ఠాగూర్ కెమెరామెన్‌గా, భూపతి యాదగిరి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. త్వరలో టీజర్, ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!