

నందమూరి బాలయ్య లేటెస్ట్ గా నటించిన సినిమా అఖండ 2. ఇప్పటికే ఈ సినిమా మొదటి భాగం రిలీజ్ అయి, అద్భుత విజయం సాధించింది. ఇక ఈ డిసెంబర్ 5వ తేదీన అఖండ 2 సినిమాతో వస్తున్నారు నందమూరి బాలయ్య. ఈ సినిమా ప్రకటన చేసిన వెంటనే బ్లాక్ బాస్టర్ అని అందరూ ఒక అంచనాకు వచ్చారు. హిందూ ధర్మం చుట్టూ ఈ కథాంశం నడుస్తుంది. ఇందులో సీన్లను దర్శకుడు బోయపాటి శ్రీను అద్భుతంగా తెరకెక్కించారట. మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ లో బోయపాటి శ్రీను కష్టాన్ని చూడవచ్చు.
అమాంతం సినిమాపై ఆ ఒక్క ట్రైలర్ అంచనాలను పెంచింది. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి మరో కీలక అప్డేట్ వచ్చేసింది. బాలకృష్ణ హీరోగా చేసిన అఖండ 2 నుంచి హైందవం లిరికల్ సాంగ్ ను తాజాగా చిత్ర బృందం రిలీజ్ చేసింది. సనాతన ధర్మం ఆధ్యాత్మిక అంశాలతో రూపొందించిన ఈ పాటను నాగ గురునాథ శర్మ ఎంతో చక్కగా రాశారు.
ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ వాయించగా, సర్వేపల్లి సిస్టర్స్ ఈ పాటను ఆలపించారు. ఈ ఇద్దరు సర్వేపల్లి సిస్టర్స్ పలికే సాంస్కృత శ్లోకాలు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. అలాంటి పాట తాజాగా రిలీజ్ అయిన నేపథ్యంలో జనాలు ఎగబడి చూస్తున్నారు. దీంతో ఈ పాట వ్యూస్ కూడా అమాంతం పెరిగిపోయాయి. కాగా అఖండ 2 సినిమాలో నందమూరి బాలయ్య హీరోగా చేయగా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించారు.











కామెంట్స్ (2)
Excited to watch this movie!
అఖండ 2 మీద ఉన్న అంచనాలు రోజు రోజుకీ ఆకాశాన్ని తాకుతున్నాయి!