

పూర్తి వినోదంతో కూడిన యూనిక్ డార్క్ కామెడీ మూవీ “గుర్రం పాపిరెడ్డి” ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించారు. మురళీ మనోహర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటి వరకు తెరపై చూడని కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్‌లు, క్యారెక్టర్ పోస్టర్లకు అద్భుతమైన స్పందన లభిస్తోంది.
ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో బ్రహ్మానందం జడ్జ్ జి. వైద్యనాథన్ పాత్రలో కనిపించారు. తెలివితక్కువవారితో వ్యవహరించడంలో అనుభవజ్ఞుడైన ఆయన దగ్గరకు ఒక విచిత్రమైన కేసు వస్తుంది. నరేష్ అగస్త్య (గుర్రం పాపిరెడ్డి), ఫరియా అబ్దుల్లా (సౌధామిని), రాజ్ కుమార్ కాసిరెడ్డి (మిలటరీ), వంశీధర్ కోస్గి (చిలిపి) అనే నలుగురు స్నేహితులు శ్రీశైలం అడవుల్లో పాతిపెట్టిన ఒక శవాన్ని దొంగతనం చేసేందుకు వెళ్తారు. అక్కడ మరో గ్యాంగ్ కూడా అదే శవం కోసం వస్తుంది. ఆ తర్వాత జరిగే సంఘటనలు ఉత్కంఠభరితంగా, వినోదాత్మకంగా సాగుతాయి.
ఆ శవం ఎవరిది? దానికోసం ఇన్ని గ్యాంగ్స్ ఎందుకు పోటీ పడుతున్నాయి? ఉడ్రాజు (యోగిబాబు) ఈ కథలో ఏ మలుపు తిప్పాడు? 1927–1987 మధ్య జీవించిన కలింగ పోతురాజు, శ్రీ మార్కండేయ రాజుతో ఈ కథకు ఉన్న అనుబంధం ఏమిటి? అనే ఆసక్తికర అంశాలు ట్రైలర్లో చూపించారు. బ్రహ్మానందం, యోగిబాబు, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్, జీవన్ కుమార్, ప్రభాస్ శ్రీను వంటి ప్రముఖ నటులతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచుతోంది.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!