

విభిన్న కథలు, బలమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం ‘లెగసీ’. సాయి కిరణ్ రెడ్డి దైదా రచన, దర్శకత్వంలో కలాహీ మీడియా బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ డ్రామాను నూతన సంవత్సర సందర్భంగా 2026 జనవరి 1 న అధికారికంగా ప్రకటిస్తూ సంచలన టీజర్‌ను విడుదల చేశారు. ‘పిండం’ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రానికి కొనసాగింపుగా దర్శకుడు మరోసారి బలమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ప్రభావవంతమైన రాజకీయ నాయకుడి వారసత్వాన్ని మోయాల్సిన పరిస్థితుల్లో చిక్కుకున్న సిద్ధార్థ్ అనే యువకుడి అంతర్గత సంఘర్షణలే ‘లెగసీ’ కథాంశం. టీజర్లో విశ్వక్ సేన్ చూపించిన రఫ్ లుక్, తీవ్ర భావోద్వేగాలు, రాజకీయ రాబందులపై తిరుగుబాటు భావం సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. గోవింద్ వసంత నేపథ్య సంగీతం, జిజు సన్నీ ఛాయాగ్రహణం, ఉన్నత నిర్మాణ విలువలు ఈ ప్రాజెక్ట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!