

ఎర్రచీర – ది బిగినింగ్ ట్రైలర్లో ఉన్న ఒక సన్నివేశాన్ని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన భూత్ బంగ్లా చిత్రంలో అనుకరించారని దర్శకుడు సుమన్ బాబు ఆరోపించారు. సినిమా విడుదలకు ముందు మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ చిత్రం మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో రూపొందిన విలక్షణమైన కథాంశమని తెలిపారు. శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 6న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉందన్నారు.
డిస్ట్రిబ్యూటర్లు, సెన్సార్ బోర్డు సభ్యులు సినిమా కంటెంట్‌ను ప్రశంసించారని, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని సుమన్ బాబు చెప్పారు. సీజీ వర్క్ కారణంగా విడుదల ఆలస్యమైనప్పటికీ, క్వాలిటీపై ఎక్కడా రాజీ పడలేదని తెలిపారు. బి, సి సెంటర్లలో ప్రతి షోకు లక్కీ డ్రా ద్వారా చీరలు బహుమతిగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఎర్రచీర సీక్వెల్‌గా అంబిక (ఎర్రచీర–2)తో పాటు రాముడా? కృష్ణుడా? అనే కొత్త సినిమా కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!