

అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ఇద్దరు సంగీత దర్శకులు పనిచేస్తున్నట్టు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించింది. ఇద్దరు అగ్ర సంగీత దర్శకుల కలయిక ఈ చిత్రాన్ని అభిమానులకు చిరస్మరణీయంగా నిలుపుతుందని పేర్కొంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మొదట దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఆయన స్వరపరిచిన “దేఖ్ లేంగే”, “ఆరా ఆఫ్ ఉస్తాద్” పాటలు ఇప్పటికే విశేష ఆదరణ పొందాయి.
పాటలన్నీ దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చగా, నేపథ్య సంగీత బాధ్యతలను ఇప్పుడు థమన్ ఎస్ చేపట్టనున్నారు. రీల్స్ ఫైనలైజేషన్లో ఆలస్యం కావడం, అలాగే దేవిశ్రీ ప్రసాద్ కు ఉన్న ఇతర ప్రాజెక్టుల కారణంగా పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చిత్రబృందం తెలిపింది. గబ్బర్ సింగ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈ నెల 26 న విడుదల చేయాలని భావించారు. అయితే టాక్సిక్ వాయిదా నేపథ్యంలో ఈ సినిమా వారం ముందే వచ్చే అవకాశాలపై ప్రచారం సాగుతుండగా, దీనిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!