
సూర్య కెరీర్లో కొన్ని నిరాశలు కూడా ఉన్నాయి. వాటిలో ‘అంజాన్’ (తెలుగులో ‘సికిందర్’) కూడా ఒకటి. ఈ సినిమా ఇప్పుడు రీ-రిలీజ్‌కు సిద్ధమవుతుండగా, దర్శకుడు లింగుస్వామి చిత్ర విఫలానికి కారణాలను మొదటిసారిగా స్పష్టంగా వెల్లడించారు.
లింగుస్వామి తనపై వచ్చిన విమర్శల గురించి మాట్లాడుతూ చెప్పారు:
“11 సంవత్సరాల క్రితం అంజాన్ ని అత్యధికంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు నాకు ఏ భయం లేదు. ఆ సమయంలో నాకు ఎడిటింగ్ కోసం సరిపోయేంత సమయం లేదు. తప్పు నాదేనని 100% అంగీకరిస్తాను.”
ఆ రోజుల్లో రిలీజ్ ఒత్తిడి, సూర్య వరుస విజయాల కారణంగా పెరిగిన అంచనాలు ఇవన్నీ కలిసి టీమ్‌ను అతి త్వరితంగా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేయాల్సిన పరిస్థితికి నెట్టాయి. దాంతో సినిమా ఫైనల్ అవుట్‌పుట్ ప్రభావితమయ్యిందని ఆయన పేర్కొన్నారు.
విడుదల సమయంలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, కాలక్రమేణా కొంతమంది అభిమానులు ఈ సినిమాను ‘కల్ట్ ఫేవరెట్’ గా చూడడం ప్రారంభించారు.
ఇప్పుడు కత్తిరించిన కొత్త వెర్షన్‌తో రీ-రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘సికిందర్’, ఈసారి థియేటర్లలో తగిన గుర్తింపు పొందుతుందేమో చూడాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!