

నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న అలియాస్ రుక్మిణి విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. నేచురల్ స్టార్ నాని సమర్పణలో, యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దండోరా ఫేమ్ మురళీ కాంత్ దేవాసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ, హాస్యం, కుటుంబ వినోదం కలగలిసిన కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
గత కొంతకాలంగా మాస్, యాక్షన్ తరహా కథల్లో కనిపించిన నితిన్ ఈసారి రొమాంటిక్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జానర్లోకి తిరిగి వస్తున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్‌కు కీలకంగా మారుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. నాని ఈ కథను ఎంచుకోవడం కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. అయితే, డిసెంబర్ 4న నాగ చైతన్య నటిస్తున్న వృషకర్మ, విశ్వక్ సేన్ నటిస్తున్న లెగసీ కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. దీంతో మూడు చిత్రాల మధ్య బాక్సాఫీస్ పోటీ నెలకొననుంది. ఈ పోటీలో అలియాస్ రుక్మిణి ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాలి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!