

బ్రాడ్ పిట్ నటించిన F1 సినిమా ఈ ఏడాది అత్యంత పెద్ద బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.8 బిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రానికి జోసఫ్ కొసిన్‌స్కీ దర్శకత్వం వహించారు. ఇందులో బ్రాడ్ పిట్, అనుభవజ్ఞుడైన రేసర్ సోన్నీ హేస్ పాత్రలో కనిపించాడు. ఫార్ములా–1 రేసింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం, రియలిస్టిక్ రేసింగ్ సన్నివేశాలు, భావోద్వేగమైన కథనం, పిట్ నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.
సినిమా భారీ విజయానికి తరువాత, ఎమ్మీ అవార్డ్స్ సమయంలోనే సీక్వెల్‌పై సూచనలు ఇచ్చిన దర్శకుడు, ఇప్పుడు అధికారికంగా F1 2 పై చర్చలు ప్రారంభమయ్యాయని వెల్లడించాడు. సోన్నీ హేస్, ఏపెక్స్ GP టీమ్‌ల కథలో తదుపరి అధ్యాయం ఎలా ఉండాలి అనే దానిపై టీం ఆలోచిస్తోంది.
గవర్నర్స్ అవార్డ్స్‌లో మాట్లాడుతూ జోసఫ్, “సోన్నీ హేస్కు తర్వాత ఏమవుతుందో, కథ ఎటు వెళ్లాలో ఆలోచిస్తున్న దశలో ఉన్నాం. ఈ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన స్పందన చూస్తే, ప్రేక్షకులు రెండో భాగం కోరుకుంటున్నారని స్పష్టంగా కనిపిస్తోంది. మేము కూడా మళ్లీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మొదటి భాగం తెరకెక్కించడం మాకు చాలా ఆనందం ఇచ్చింది” అన్నారు. అభిమానుల డిమాండ్ దృష్ట్యా, F1 సీక్వెల్ మరి దూరంలో లేనట్టే అనిపిస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!