

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ విడుదల తేదీ ఖరారైంది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతోంది. టీజర్లో రవితేజ, డింపుల్ హయతి భార్యగా, ఆశికా రంగనాథ్ ప్రేమికగా కనిపిస్తూ నవ్వులు పూయించారు. అలాగే భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన పాటలు మంచి స్పందన తెచ్చుకోగా, వామ్మో వాయ్యో సాంగ్ వైరల్‌గా మారింది.
ఇక తాజాగా చిత్రబృందం జనవరి 7 న థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుందని ప్రకటించింది. నవ్వులు, విచిత్రమైన పరిస్థితులు, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో ట్రైలర్ ఉండనుందని అంచనాలు నెలకొన్నాయి. భోగి రోజున, జనవరి 13 న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా, సంక్రాంతి రేసులో తప్పక చూడాల్సిన చిత్రంగా నిలవనుంది. ప్రసాద్ మురెళ్ల సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్షన్ చిత్రానికి మరింత బలం చేకూర్చాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!