

పొరుగు దేశం పాకిస్థాన్‌తో భారత్ కు ఎదురైన సంఘర్షణల నేపథ్యంలో ఇప్పటికే అనేక కథలు బాలీవుడ్లో తెరకెక్కాయి. ఇండో–పాక్ వార్ నేపథ్యంతో రూపొందిన సినిమాలు ప్రేక్షకుల్లో దేశభక్తి భావాన్ని మరింత బలపరిచాయి. త్వరలో అదే కోవలో Border 2 కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవల పాక్‌లోని గ్యాంగ్స్టర్లు, ఐఎస్ఐ కుట్రలకు చెక్ పెట్టేందుకు రా చేపట్టిన ఆపరేషన్ నేపథ్యంతో రూపొందిన దురంధర్ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటోంది.
ఈ క్రమంలో ఇప్పుడు మరో శక్తివంతమైన యుద్ధ కథ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. 1971 ఇండో–పాక్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన బయోగ్రాఫికల్ వార్ మూవీ Akkees త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంతో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మనవడు అగ స్మనంద హీరోగా పరిచయం అవుతున్నాడు. కమర్షియల్ యాక్షన్ హీరోగా తన కెరీర్‌ను ప్రారంభించేందుకు అతడు సిద్ధమయ్యాడు.
ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫైనల్ ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచింది.
ఇండియన్ ఆర్మీలో అతి చిన్న వయసులోనే పరమ్ వీర్ చక్ర అందుకున్న వీరుడు అరుణ్ ఖేతర్పాల్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. 21 ఏళ్ల వయసులోనే బాటిల్ ఆఫ్ బసంతర్లో పాకిస్థాన్ సైన్యాన్ని ఎదుర్కొని వీరోచితంగా పోరాడిన ఘటనలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించారు.
ఈ చిత్రంలో ఇటీవల మృతి చెందిన నెటరన్ నటుడు ధర్మేంద్రతో పాటు, పాతాళ్ లోక్, మహారాజ్ ఫేమ్ జైదీష్ అర్జపర్ కీలక పాత్రల్లో నటించారు. యుద్ధం అంటే కేవలం తుపాకుల మోత మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న భావోద్వేగాలు, త్యాగాలు కూడా అని దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాతో స్పష్టంగా చూపించేందుకు ప్రయత్నించారు.
కొత్త ఏడాది కానుకగా 2026 జనవరి 1 న ఈ సినిమా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. పాకిస్థాన్ దురాగతాలను ఎండగడుతూ, భారత జవాన్ల శౌర్యాన్ని గర్వంగా చూపించే ‘అక్కీస్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!