
రాజకీయాలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కేరళలో విశేషమైన అభిమాన వర్గం ఉంది. ఈ నేపథ్యంలో తిరువనంతపురంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కేరళ రాష్ట్ర ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో, స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రభు సారథ్యంలో జరిగిన ఈ సమావేశంలో భవిష్యత్ ప్రణాళికలు, అసోసియేషన్ విస్తరణపై చర్చించారు. అభిమానులను మరింతగా కలుపుకోవడం, దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించడం లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో అతిపెద్ద ఫ్యాన్స్ అసోసియేషన్‌లలో ఒకటైన ఏఏఎఫ్ఏ, సౌత్ ఇండియాలో విజయవంతంగా కార్యక్రమాలు పూర్తి చేసి, ఇకపై నార్త్ ఇండియాలో కూడా కార్యకలాపాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. జూన్ 4న సౌత్ ఇండియా స్థాయి గ్రాండ్ మీటింగ్‌ను నిర్వహించనున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!