

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ‘డాన్ 3’ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగిన విషయంపై వివాదం మరింత ముదిరింది. దర్శక నిర్మాత ఫర్హాన్ అక్తర్ రూపొందించాలనుకున్న ఈ చిత్రానికి సంబంధించి వచ్చిన విభేదాల నేపథ్యంలో, ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్‌డబ్ల్యూఐసీఈ) రణ్‌వీర్ సింగ్‌పై నిషేధం విధించినట్లు ప్రకటించింది. చర్చలకు ఆయన సహకరించలేదని, నిర్మాతలు ఎదుర్కొన్న సుమారు రూ.45 కోట్ల ప్రీ ప్రొడక్షన్ నష్టంపై వివాదం కొనసాగుతున్నట్లు తెలిపింది.
వివాదం పరిష్కారం అయ్యే వరకు రణ్‌వీర్ సింగ్‌తో ఎవరూ పని చేయవద్దని పరిశ్రమకు సూచిస్తూ ఎఫ్‌డబ్ల్యూఐసీఈ ప్రకటన విడుదల చేసింది. కీలక దశలో ప్రముఖ నటులు ప్రాజెక్ట్‌ల నుంచి తప్పుకోవడం సినీ పరిశ్రమ స్థిరత్వంపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు మరింత చర్చలకు సిద్ధంగా ఉన్నామని కూడా ఫెడరేషన్ స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!