

విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం విడుదలపై మరోసారి వాయిదా ప్రచారం మొదలైంది. ఇప్పటికే ప్రకటించిన అక్టోబర్ 9న సినిమా విడుదల కాకపోవచ్చని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం, అక్టోబర్ 9న బాక్సాఫీస్ వద్ద నెలకొనే పోటీ వంటి కారణాలతో మేకర్స్ విడుదల తేదీని మరోసారి మార్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
ప్రస్తుతం అక్టోబర్ 16 లేదా 30 తేదీల్లో ఏదో ఒకదానిని పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ 16న ఇతర పెద్ద సినిమాల విడుదల ఉండటంతో ఆ తేదీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 30 అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం లభించడంతో పాటు బాక్సాఫీస్ పోటీ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు, అక్టోబర్ 6న ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ విడుదల కార్యక్రమం జరగనుంది. ట్రైలర్ అనుకున్న సమయానికి విడుదలైతే అక్టోబర్ 9 విడుదల కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు భావించవచ్చు. ట్రైలర్ వాయిదా పడితే సినిమా రిలీజ్‌పై వస్తున్న ఊహాగానాలు మరింత బలపడే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!