

దర్శకుడు శేఖర్ కపూర్ తెరకెక్కిస్తున్న "మసూమ్: ది నెక్స్ట్ జనరేషన్" చిత్రం మరోసారి సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 1983లో విడుదలైన క్లాసిక్ "మసూమ్"కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించడమే కాకుండా సహ నిర్మాతగా కూడా వ్యవహరించనున్నట్లు శేఖర్ కపూర్ వెల్లడించారు. కథ విన్న తర్వాత ఎంతో ప్రభావితమైన రెహ్మాన్ స్వయంగా ఈ చిత్రంలో భాగస్వామి కావాలనే ఆసక్తి చూపినట్లు ఆయన తెలిపారు.
చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తవగా, నటీనటుల ఎంపిక కూడా ఖరారైనట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. సంగీత పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ఒక పాట పూర్తికాగా మరో పాట రూపుదిద్దుకుంటోందని శేఖర్ కపూర్ వెల్లడించారు. రెహ్మాన్ భాగస్వామ్యం ఈ ప్రాజెక్ట్‌కు మరింత బలం, విశ్వసనీయతను తీసుకొచ్చిందని చిత్ర బృందం భావిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!