

నిత్యం నడక అలవాటు చేసుకుంటే బరువు తగ్గే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బిజీ షెడ్యూల్ కారణంగా జిమ్ లేదా కఠినమైన వ్యాయామాలు చేయలేని వారికి వాకింగ్ ఒక సులభమైన మార్గం. నేటి కాలంలో ఊబకాయం ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. అందుకే చాలామంది బరువు తగ్గేందుకు వ్యాయామం, యోగా, ఆహార నియమాలు పాటిస్తున్నారు.
నిపుణుల మాట ప్రకారం, రోజూ 30 నుంచి 45 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేస్తే సుమారు 150 నుంచి 250 కేలరీలు బర్న్ అవుతాయి. నడక వల్ల శరీరంలోని జీవక్రియ మెరుగుపడుతుంది, శక్తి పెరుగుతుంది. అంతేకాదు, ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అన్ని వయసులవారు సులభంగా చేయగలిగే వ్యాయామం కావడంతో వాకింగ్ మంచి ఎంపికగా భావిస్తున్నారు.
ప్రతిరోజూ మెట్లు ఎక్కడం, ఇంటి చుట్టూ నడక, స్నేహితులతో వాకింగ్ చేయడం వంటి చిన్న అలవాట్లు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నడక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి రోజూ కనీసం 30 నిమిషాలు నడవాలని వైద్యులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ సమాచారం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వ్యాయామం ప్రారంభించే ముందు డాక్టర్ను సంప్రదించండి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!