

ఏం జరిగినా సరే అంగీకరించాలి. మన చేతిలో ఏమీ లేదు. ఎందుకిలా జరిగింది అని ఆలోచించి, బాధపడడం వల్ల ఎనర్జీ అంతా వృథా అవుతుంది. అదే ఎనర్జీని సమస్యను పరిష్కరించుకోవడంపైనే పెట్టితే ఏమైనా ఉపయోగం ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో గడిపితే మనసు రిలాక్స్ అవుతుంది. ప్రతికూల ఆలోచనలు దూరమవుతాయి. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. హాయిగా నిద్రపట్టేందుకు అవసరమైన హార్మోన్స్ విడుదలవుతాయి. దీన్నే ఫారెస్ట్ బాతింగ్ అంటారు. జపనీస్ చాలా ఎక్కువగా ఈ టెక్నిక్ ఫాలో అవుతారు.
మానసికంగా ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే టెన్షన్ తగ్గించి ప్రశాంతంగా మార్చేస్తుంది మెడిటేషన్. అందుకే రోజూ కనీసం ఓ పావుగంట పాటు ధ్యానం చేయాలని యోగా ఎక్స్పర్ట్స్ సలహా ఇస్తుంటారు. జపనీస్ కూడా ఇదే టెక్నిక్ ఫాలో చేస్తారు. దీని పేరు జాజెన్.
ఇంకా ఒక టెక్నిక్ సవాళ్లను ఎదుర్కోవడం. ఇక్కడే చాలా మంది తడబడతారు. అందుకే ఎక్కువగా ఆలోచిస్తారు. ఎలాంటి కఠినమైన సవాలు వచ్చినా సరే గట్టిగా నిలబడి ఎదుర్కోవాలి. దీన్నే జపనీస్ గమన్ టెక్నిక్ అంటారు. జీవితం సడెన్ షాక్‌లతో ఎదుర్కరించే సందర్భాలు ఇస్తుంది. వెంటనే బెదిరిపోతే ఏ ఉపయోగం లేదు. అలాంటప్పుడు స్ట్రాంగ్‌గా ఉండాలి. దీని తర్వాత అలవాటు అవుతుంది.
చివరి టెక్నిక్ డైవర్ట్ అవడం. ఓ ఇబ్బంది వచ్చినప్పుడు ఒకే మూడ్‌లో ఎక్కువ సేపు ఉండటం ద్వారా పరిష్కారం దొరకదు. డైవర్ట్ అవ్వడానికి నచ్చిన పని చేయాలి. కొత్త పనులు కూడా ట్రై చేయాలి. ఎప్పుడూ ఒంటరిగా సినిమాకి వెళ్లకపోతే ఈసారి ప్రయత్నించవచ్చు. లేదా కొద్దిసేపు బయటకి వెళ్లి వాకింగ్ చేయాలి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!