
క్రీడలు

హైదరాబాద్‌లో నిర్వహించిన సరస్ మేళాలో రికార్డు స్థాయిలో రూ.9.29 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఈ మేళాను మొత్తం 5.98 లక్షల మంది సందర్శించారు. అక్టోబర్ 7 నుంచి 18 వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 225 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ మేళా మహిళా సంఘాలకు తమ ఉత్పత్తులను ప్రజలకు పరిచయం చేసేందుకు, విక్రయాలను పెంచుకునేందుకు మంచి వేదికగా నిలిచింది.
2025లో సరస్ మేళాలో రూ.3.28 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఈసారి అమ్మకాలు గణనీయంగా పెరగడం మేళాకు పెరుగుతున్న ఆదరణను తెలియజేస్తోంది. మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు కల్పించడం, మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడం ద్వారా వారి ఆర్థిక స్వావలంబనకు సరస్ మేళా తోడ్పడుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!