

ప్రస్తుత కాలంలో ఫ్యాటీ లివర్ ఒక సాధారణ సమస్యగా మారుతోంది. పెద్దవారితో పాటు యువత కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. కొన్ని లక్షణాల ద్వారానే ఫ్యాటీ లివర్‌ను గుర్తించే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అల్కహాల్ వల్ల మాత్రమే ఫ్యాటీ లివర్ వస్తుందని చాలా మంది భావించినా, నాన్-అల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కేసులు కూడా పెరుగుతున్నాయని లివర్ నిపుణులు వివరిస్తున్నారు.
కాలేయంలో కొవ్వు పేరుకుపోయినప్పుడు ఉదరం చుట్టూ అదనపు ఫ్యాట్ పెరిగే అవకాశం ఉంటుంది. స్పష్టమైన కారణం లేకుండా అలసట లేదా బలహీనత అనిపిస్తే, అది కాలేయ పనితీరు సరిగా లేకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. కాలేయం ఉన్న కుడి భాగంలో తేలికపాటి నొప్పి లేదా భారంగా అనిపించినా దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
అలాగే, ఇన్సులిన్ నిరోధకత పెరిగినప్పుడు చర్మం నల్లబడటం లేదా ముఖంపై మొటిమలు కనిపించే అవకాశం ఉంది. కాలేయంపై ఒత్తిడి పెరిగినప్పుడు ఆకలి తగ్గిపోవడం కూడా ఫ్యాటీ లివర్‌కు సూచన కావచ్చు.
ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా ఫ్యాటీ లివర్‌ను నియంత్రించుకోవచ్చని చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనిపై మేము బాధ్యత వహించము. మీకు ఎలాంటి అనుమానాలు, సమస్యలు లేదా లక్షణాలు ఉన్నా తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించి వారి సూచనలను అనుసరించండి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!