

ఈ హెచ్చరిక సంకేతాలను నిర్లక్ష్యం చేయవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రతి రాత్రి బిగ్గరగా గురక పెట్టడం, నిద్రలో ఊపిరి ఆడకపోవడం, ఊపిరాడనట్లు అనిపించడం, తలనొప్పితో మేల్కొనడం, నోరు ఎండిపోవడం, పగటిపూట అధికంగా నిద్రపోవడం వంటి లక్షణాలు శరీరంలో ఏదో సమస్య ఉన్నట్లు సూచిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
డాక్టర్ల ప్రకారం, గురక శాశ్వత సమస్య కాదని, సరైన చర్యలు తీసుకుంటే తగ్గించుకోవచ్చని తెలిపారు. ముందుగా గురకకు కారణం ఏమిటో గుర్తించడం చాలా ముఖ్యమని వైద్యులు అంటున్నారు. కొంతమందిలో అధిక బరువు కారణంగా గురక వస్తే, బరువు తగ్గిన తర్వాత సమస్య తగ్గుతుందని డాక్టర్లు వివరిస్తున్నారు.
వైద్యులు సూచిస్తున్నట్లు, నిద్ర భంగిమను సరిచేసుకోవడం, ముక్కు లేదా గొంతులో ఉండే అడ్డంకులను తొలగించడం ద్వారా కూడా గురక సమస్యకు ఉపశమనం లభిస్తుంది. జీవనశైలి మార్పులు సరిపోని సందర్భాల్లో, వైద్యుల సలహాతో చికిత్సలు లేదా ప్రత్యేక పరికరాలు అవసరం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనిక: మేము అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎటువంటి బాధ్యత వహించము. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని, న్యూట్రిషనిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!