

యంగ్ బ్యూటీ శ్రీలీల వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నా, ఆశించిన స్థాయి విజయాలు మాత్రం అంతగా అందుకోవడం లేదు. ప్రస్తుతం ఆమె శివకార్తికేయన్ సరసన నటిస్తున్న ‘పరాశక్తి’ చిత్రంతో కోలీవుడ్‌లో అడుగు పెడుతోంది. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.
అయితే, ఈ చిత్రం రిలీజ్‌కు ముందే శ్రీలీల మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు సైన్ చేసినట్లు సమాచారం. తన తదుపరి సినిమాలో కూడా ఆమె శివకార్తికేయన్‌తో మరోసారి జోడీ కట్టనుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ స్టార్ జోడీని మరోసారి తెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సిబి చక్రవర్తి దర్శకత్వంలో రూపొందనున్న ఈ కొత్త సినిమా షూటింగ్ డిసెంబర్ 10న ప్రారంభం కానుందని చెబుతున్నారు. గతంలో సిబి చక్రవర్తి–శివకార్తికేయన్ కాంబినేషన్లో వచ్చిన ‘డాన్’ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో, ఈ కొత్త కాంబోపై భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా ఫిక్స్ అయ్యిందా? అనే విషయంలో మేకర్స్ నుంచి ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.













.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!