

గత కొన్నినెలలుగా నటి సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు మధ్య ఉన్న రిలేషన్షిప్ రూమర్స్ మీడియాలో బాగా హీట్‌గా మారాయి. ఇద్దరూ చాలా సార్లు కలిసి కనిపించారు, సోషల్ మీడియాలో కూడా కలిసి ఫోటోలు షేర్ చేసుకున్నారు. కానీ, ఈ రూమర్స్‌కి సంబంధించిన ఎలాంటి క్లారిటీ మాత్రం ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇద్దరూ గతంలో కూడా చాలా ప్రాజెక్ట్స్‌లో కలిసి పని చేశారు. సమంత నటించిన ది ఫ్యామిలీ మాన్ 2 మరియు సిటాడెల్: హనీ బన్నీ సినిమాలకు రాజ్ డైరెక్టర్‌గా వ్యవహరించగా, సమంత మొదటి ప్రొడక్షన్ వెంచర్ శుభంకి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరూ మళ్లీ కొత్త సినిమా మా ఇంటి బంగారం కోసం చేతులు కలిపారు.
ఈ సినిమా షూట్ నేడు హైదరాబాద్‌లో జరిగే పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని సమంత స్వయంగా తన త్రలలా మోషన్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మిస్తోంది. నందిని రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, హిమాంక్ దువ్వూరు కో-ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. రాజ్ మళ్లీ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. సమంత పూజా కార్యక్రమం ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా, వాటిలో రాజ్ కూడా కనిపించడంతో వారి రిలేషన్ రూమర్స్ మళ్లీ బాగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు “ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది?” అంటూ సోషల్ మీడియాలో చర్చలు చేస్తున్నారు. ఇక మా ఇంటి బంగారం సినిమాతో సమంత చాలా గ్యాప్ తర్వాత తెలుగు లీడ్ రోల్లో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా 2026లో విడుదల కానుంది.











కామెంట్స్ (1)
Can’t wait for her Telugu comeback film!