.jpg&w=3840&q=75)

నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై మరోసారి తీవ్రంగా స్పందించారు. తన వ్యక్తిగత జీవితంపై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్న నెటిజన్లకు బలమైన వీడియో ద్వారా సమాధానం ఇచ్చారు. ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ అంటే ఏమిటో వివరించి, దాన్ని కొందరు తప్పుగా ఉపయోగిస్తున్నారని చెప్పారు.
కళాకారులను నేరస్థులు లేదా ఉగ్రవాదుల్లా ఎందుకు చూస్తున్నారని ఆమె ప్రశ్నించారు. సెలబ్రిటీల అభిప్రాయాలు నచ్చకపోతే అన్‌ఫాలో చేయాలని, కానీ దూషణలకు దిగడం సరైంది కాదని సూచించారు. బూతులు మాట్లాడటాన్ని భావ ప్రకటన స్వేచ్ఛగా భావించడం తప్పని, అది వేధింపుల కిందకే వస్తుందని స్పష్టం చేశారు.
ప్రతి ఒక్కరికీ గౌరవంగా జీవించే హక్కు ఉందని, ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. తనను దూషించిన వారిపై ఇప్పటికే కేసులు పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇలాంటి ప్రవర్తన కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో గౌరవంగా ప్రవర్తించాలని, అనవసర విమర్శలతో ఇతరులను బాధించవద్దని ఆమె కోరారు.








.webp&w=3840&q=75)

.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!