

బిగ్ బాస్ తెలుగు 9 ప్రారంభం నుంచే తనూజ పేరు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. మొదటి వారం నుంచే అత్యధిక ఓటింగ్‌తో టైటిల్ రేసులో ముందంజలో నిలిచిన ఆమె, ఈసారి అమ్మాయి విజేత కావడం ఖాయమని చాలామంది భావించారు. అదే స్థాయిలో ఆమెకు ఓటింగ్ కూడా లభించింది. ఫినాలే వరకు ఉత్కంఠ కొనసాగింది.
అయితే, ప్రతి చిన్న విషయానికి భావోద్వేగానికి లోనవడం, తరచూ ఏడవడం, గొడవల్లో ఇరుక్కోవడం వంటి అంశాలు చివరికి ఆమెను ట్రోఫీకి కొంత దూరం చేశాయనే అభిప్రాయం వినిపిస్తోంది. దాదాపు 15 వారాల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగిన తనూజ, ఈ షో ద్వారా మంచి పారితోషికం కూడా అందుకున్నట్లు సమాచారం. వారానికి సుమారు రూ.2.50 లక్షల చొప్పున తీసుకున్న ఆమె, మొత్తం 15 వారాలకు కలిపి దాదాపు రూ.37.5 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది.
రన్నరప్‌గా నిలిచిన తనూజ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. అభిమానుల మద్దతు వల్లే ఇంతదూరం వచ్చానని, ఎప్పటికీ వారికి రుణపడి ఉంటానని భావోద్వేగంగా చెప్పుకొచ్చింది.
తనూజ పుట్టస్వామి పేరు బిగ్‌బాస్ సీజన్ 9 లో మొదటి నుంచే టైటిల్ రేసులో వినిపించింది. ముద్ద మందారం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆమె, కొంతకాలం టీవీకి దూరంగా ఉండి, తర్వాత కుక్ విత్ జాతిరత్నాలు షోలో పాల్గొంది. అక్కడి నుంచి బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టి, మొదటి వారం నుంచే టాప్ ఓటింగ్‌తో టాప్ 1 స్థానంలో సత్తా చాటింది.
చివరి నిమిషం వరకు కూడా ఆమెకు అత్యధిక ఓటింగ్ వచ్చినప్పటికీ, స్వల్ప తేడాతో కళ్యాణ్ పడాల విజేతగా నిలిచాడు. కళ్యాణ్ రూ.35 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. అయితే విజేతకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో రన్నరప్ తనూజ కూడా మంచి మొత్తంలో పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.
.jpg&w=3840&q=75)


_1771477764226.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!