

‘పెద్ది’ సినిమా విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో రామ్ చరణ్ తదుపరి చిత్రం ఆర్సీ17పై ఆసక్తి పెరిగింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘రంగస్థలం’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ వెంటనే ప్రారంభం కాకపోవచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సమాచారం ప్రకారం ‘పెద్ది’ చిత్రంలోని కుస్తీ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్ చేతికి గాయమైనట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్‌కు ఆటంకం కలగకుండా ఆయన చిత్రీకరణ పూర్తి చేసినట్లు సమాచారం. ప్రస్తుతం చిన్న సర్జరీ చేయించుకుని వైద్యుల సూచన మేరకు దాదాపు మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ గ్యాప్‌లో దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ పనులతో పాటు ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేయనున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!