

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో మృణాల్ క్లోజ్‌గా ఉండటం అనేక అనుమానాలకు తావిచ్చింది. సన్ ఆఫ్ సర్దార్2 స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా ధనుష్ చేతిని పట్టుకున్న మృణాల్ వీడియోలు వైరల్ అయ్యాయి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ధనుష్‌ని, అతని కుటుంబ సభ్యులను మృణాల్ ఫాలో కావడం కూడా అనేక అనుమానాలకు తావిచ్చింది. ఆ తర్వాత వీరి వ్యవహారం సద్దుమణగగా.. ఇటీవల తన కాశీ పర్యటన, వారణాసితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ధనుష్ చేసిన పోస్ట్‌కు మృణాల్ కామెంట్ పెట్టడంతో తిరిగి ఊహాగానాలు వెల్లువెత్తాయి.
అయితే ఇంతలోనే మృణాల్‌కు సంబంధించి మరో కొత్త వార్త చక్కర్లు కొడుతోంది. మృణాల్ మరో కొత్త బాయ్‌ఫ్రెండ్‌ని వెతుక్కుందన్నది ఆ వార్తల సారాంశం. అతను ఎవరో కాదు టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో తీవ్రంగా గాయపడిన ఈ బ్యాట్స్‌మెన్‌తో మృణాల్ డేటింగ్ చేస్తున్నారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ తమ బంధాన్ని ప్రస్తుతం గోప్యంగా ఉంచాలని భావిస్తున్నారట. సమయం చూసి తమ రిలేషన్ బయటపెట్టాలని ప్రణాళికలు రచిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ, మృణాల్‌పై నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగుతున్నారు.










కామెంట్స్ (1)
Let’s wait and see.