
ఓటిటి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పలు భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్టుల్లో దర్శకుడు అట్లీతో చేస్తున్న చిత్రం కూడా ఒకటి. ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ విభిన్న షేడ్స్‌లో కనిపిస్తారని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
ఇటీవల సోషల్ మీడియాలో ఒక లుక్ వైరల్ అవుతోంది. అది అల్లు అర్జున్ ఓల్డ్ ఏజ్ మాస్ గెటప్ అని ప్రచారం జరుగుతోంది. కొందరు అది యంగ్ అల్లు అర్జున్ తండ్రి పాత్ర అని కూడా చెబుతున్నారు. అయితే ఆ ఫోటోను జాగ్రత్తగా చూస్తే ఎడిట్ చేసినట్లుగా అనిపిస్తోంది. అందులో ఎంత నిజం ఉందో అధికారిక సమాచారం వచ్చే వరకు చెప్పలేం. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!